టర్కీ పార్లమెంట్ లో 'మ్యారీ యువర్ రేపిస్ట్' బిల్లు ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం
- January 25, 2020
ఇస్తాంబుల్:సమాజంలో మహిళలకు భద్రత లేకుండాపోతోంది. ఆడవాళ్లు రోడ్డు మీదకు ఒంటరిగా రావాలంటేనే భయపడిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినతరమైన చట్టాలు తెచ్చినా నిత్యం ఎక్కడో ఒక చోటు అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అత్యాచార నిందితులకు ఉరే సరైన శిక్ష అని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టర్కీ పార్లమెంట్లో ఓ వివాదాస్పదమైన బిల్లును ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది.
తూర్పు దేశమైన టర్కీలో రేపిస్టులను శిక్ష నుంచి తప్పించేలా ఓ చట్టాన్ని రూపొందిస్తున్నారు. అదే 'మ్యారీ యువర్ రేపిస్ట్'. ఇక దీనికి సంబంధించిన బిల్లును ఈ నెలాఖరున పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. 18 ఏళ్ళ లోపు చిన్నారులపై లైంగిక దాడి లేదా అత్యాచారం చేసిన నిందితులకు ఇది వర్తిస్తుంది. వారు శిక్ష నుంచి మినహాయింపు పొందాలంటే.. అత్యాచార బాధితురాలిని తప్పనిసరిగా పెళ్లి చేసుకునేలా ఈ బిల్లును సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ బిల్లు టర్కీలో వివాదాస్పదం కావడమే కాకుండా.. మహిళా హక్కుల ప్రచారకర్తలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి వివాదాస్పద బిల్లే ఒకటి 2016లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. నాడు ఆ బిల్లుపై దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటడంతో ఆ బిల్లును ఉపసంహరించుకుంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







