ఫస్ట్ సాంగ్ 'మై లవ్' కి మంచి స్పందన
- January 25, 2020
సంచలన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'వరల్డ్ ఫేమస్ లవర్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తొన్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే హీరోయిన్లు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల చిత్ర బృందం ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ 'మై లవ్'ను రిలీజ్ చేసింది. గోపీసుందర్ వినసొంపైన బాణీలు, రెహమాన్ ఆకట్టుకొనే సాహిత్యం, శ్రీకృష్ణ, రమ్యా బెహరా మధుర గానం కలిసి హృదయాన్ని హత్తుకొనే మేలోడీగా ఈ పాట తయారైంది. నలుగురు హీరోయిన్లతోనూ విజయ్ దేవరకొండ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయినట్లు ఈ పాటలో కనిపిస్తున్నాడు. కాగా సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకర్షిస్తోన్న ఈ చార్ట్ బస్టర్ రొమాంటిక్ సాంగ్ యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది.
క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మిస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్'ను కె.ఎస్. రామారావు సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రధాన తారాగణం:
విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే.
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: క్రాంతిమాధవ్
నిర్మాత: కె.ఎ. వల్లభ
సమర్పణ: కె.ఎస్. రామారావు
సంగీతం: గోపీసుందర్
సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







