టీఆర్ఎస్ నేషనల్ రికార్డు
- January 25, 2020
తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ స్థాయిలో ఓ రికార్డు సృష్టించింది. గులాబీ దళం నేషనల్ రికార్డు సాధించింది. తాజా మునిసిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశం తేటతెల్లమైంది.
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విధంగా ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 120 మునిసిపాలిటీల్లో 109 మునిసిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంటే 91 శాతం మునిసిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ సాధించింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోను, ఏ పార్టీ సైతం ఇప్పటి వరకు సాధించని విజయమిది. అధికారపార్టీగా ఎంతో కొంత సానుకూల పరిస్థితి వుంటుంది. కానీ, ఈ స్థాయిలో 90 శాతం కంటే మించిన సీట్లను ఒక పార్టీ గెలుచుకోవడం మాత్రం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
అటు కార్పొరేషన్లలోను మొత్తం పది నగర పాలక సంస్థలు తెలంగాణలో వుంటే.. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికలను పక్కన పెడితే.. మిగిలిన తొమ్మిది కార్పొరేషన్లకు గాను ఏడింటిని తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది. అంటే సుమారు 77 శాతం సీట్లను టీఆరఎస్ గెలుచుకుందన్నమాట. దేశంలో వందలాది పార్టీలుండగా.. వాటిలో అధికారంలోకి వచ్చిన, వచ్చే పార్టీలతో పోలిస్తే.. టీఆర్ఎస్ రికార్డు అనితర సాధ్యమని పరిశీలకులు అంఛనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







