మున్సిపోల్స్ లో కారు జోరు

- January 25, 2020 , by Maagulf
మున్సిపోల్స్ లో కారు జోరు

హైదరాబాద్:మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి గులాబీ పార్టీ సత్తా చాటింది . తెలంగాణలో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించింది . 120 కి మున్సిపాలిటీల్లో 108 వరకూ గెలచుకుని తనకు సాటి లేరని తేల్చి చెప్పింది . ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ , బీజేపీ సింగిల్ డిజిట్ కు పరిమితం అవ్వాల్సి వచ్చింది . ఈ ఎన్నికల్లో గెలుపుతో మరింత జోష్ లో ఉన్న కేసీఆర్ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు .

ఉద్యోగుల పదవీ విరమణను పెంచుతానని కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో వివరించారు . ఈ ప్రకటన ఉద్యోగుల్లో ఆనందం నింపింది . పదవీ కాలం రెండు ఏళ్లు పెరిగినా ఉద్యోగులకు ఎంతో సంతోషం ఇస్తుంది . దీని వల్ల వారు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది . ఏ ఉద్యోగికైనా పదవీ కాలం చివర్లో అత్యధిక వేతనం వస్తుందన్న సంగతి తెలిసిందే . ఆ చివరి జీతం మరో రెండేళ్లు వస్తుందంటే ఎంత ఊరట కలుగుతుందో చెప్పనక్కర్లేదు కదా .

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఘనవిజయం ఏ పార్టీకి దొరకదని , ఇది మామూలు విషయం కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు . పట్టణ ప్రాంతాల్లో భిన్నమైన ఓటర్లు ఉంటారని , వారు కూడా ఈసారి ఏకపక్షంగా ఓట్లేశారని సీఎం కేసీఆర్ తెలిపారు . డిసెంబరులో తాను అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళుతుంటే అనేక వ్యాఖ్యలు చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు . కానీ 88 సీట్లు గెలిచామని సీఎం కేసీఆర్ తెలిపారు .

ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తమను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు విశ్వప్రయత్నాలు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు . కోర్టుల చుట్టూ తిరిగారని ఆరోపించారు . ఎన్నికలు పూర్తయితే అభివృద్ధి పనులు కొనసాగించవచ్చని తాము భావిస్తే , ఎలాగైనా ఎన్నికలు ఆపాలని విపక్షాలు పనిచేశాయని కేసీఆర్ మండిపడ్డారు . అనేక అవాంతరాలను అధిగమించి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు ముక్తకంఠంతో తీర్పు చెప్పారని కేసీఆర్ తెలిపారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com