యాంకర్ ప్రదీప్ హీరోగా చిత్రం.. మోషన్ పోస్టర్లని ఆవిష్కరించిన రానా
- January 26, 2020
ప్రదీప్ మాచిరాజు ఓ ప్రక్కన యాంకర్ గా చేస్తూనే..మరో ప్రక్క సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా మారి ఓ చిత్రం చేసారు. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ద్వారా మున్నా అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర 'ఆర్య 2', 'నేనొక్కడినే' సినిమాలకు పనిచేసారు మున్నా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లని హీరో రానా ఆవిష్కరించారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘రొమాంటిక్ కామెడీ చిత్రమిది. మేం డిజైన్ చేసిన పేరుకి మంచి స్పందన లభించింది. రానా ఈ పోస్టర్ల కాన్సెప్ట్‌ని మెచ్చుకున్నారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము’’అని అన్నారు.
ఫస్ట్ లుక్ పోస్టరులో గ్రామీణుడిగా ప్రదీప్ కనిపించాడు. ఈ లుక్ సూర్యోదయం, జలపాతాలు, పక్షులు, చెట్లతో బ్యాగ్రౌండ్ ఒక అందమైన పెయింటింగ్‌ను తలపిస్తోంది. బాణం విసురుతున్న మన్మథుడు, గులాబీ, లవ్ లెటర్, తాళం వేసిన హృదయం వంటి వాటితో ఆ టైటిల్‌ను రూపకల్పన చేశారు. శివన్నారాయణ, హేమ, పోసాని, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: చంద్రబోస్.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..