ఖతార్‌ వీసాస్‌ ట్రేడింగ్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌

- January 26, 2020 , by Maagulf
ఖతార్‌ వీసాస్‌ ట్రేడింగ్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌

మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ - సెర్చ్‌ అండ్‌ ఫాలో అప్‌ డిపార్ట్‌మెంట్‌, వీసాల్ని విక్రయిస్తున్న గ్యాంగ్‌ని అరెస్ట్‌ చేయడం జరిగింది. మొత్తం 9 మంది గ్యాంగ్‌ సభ్యులు పోలీసులకు చిక్కారు. ఫాలో అప్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ అబ్దుల్లా జబెర్‌ అల్‌ లబ్డాహ్‌ మాట్లాడుతూ, అడ్మినిస్ట్రేషన్‌ పలు చోట్ల ఇన్‌స్పెక్షన్స్‌ నిర్వహించడం జరిగిందనీ, ఈ క్రమంలో పలువుర్ని అరెస్ట్‌ చేశామని చెప్పారు. సెర్చ్‌ అండ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ కెప్టన్‌ ఒమర్‌ ఖలీఫా అల్‌ రుమైహి మాట్లాడుతూ, తొమ్మిది మంది ఆఫ్రికన్‌ జాతీయుల్ని అలాగే ఓ ఆసియన్‌ జాతీయుడ్ని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. సోషల్‌ మీడియా వేదికగా వీసా ట్రేడ్‌ జరుపుతున్నట్లు 'టిప్‌' అందడంతో ఈ క్యాంపెయిన్‌ చేపట్టినట్లు ఆయన తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com