యాపిల్ సిడార్ వెనిగర్‌తో ఉపయోగం...

- January 27, 2020 , by Maagulf
యాపిల్ సిడార్ వెనిగర్‌తో ఉపయోగం...

చుండ్రు చాలా మందిని వేధించే సమస్య, కాలాలతో సంబంధం లేకుండా యువతలో చాలా మందికి ఇది వస్తోంది. దీని వలన వెంట్రుకలు రాలిపోతాయు, తలలో నవ పుడుతుంది, అనారోగ్యాలు కూడా వస్తాయి. పెరిగే కాలుష్యం కూడా చుండ్రుకు ప్రధాన కారణం. షాంపూలు వాడినా ఎలాంటి ప్రయోజనం పొందని వారు ఎక్కువ మంది ఉన్నారు. 
 
కొందరు డాక్టర్ల చుట్టూ తిరుగుతారు కానీ ఫలితం ఉండదు. కొందరు మాత్రం దీనిని తగ్గించుకునే ఉపాయం మన చేతుల్లోనే ఉందని చెబుతున్నారు. యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌కి యాంటీఫంగల్‌ గుణాలు ఉంటాయి. దీన్ని నేరుగా తలకు అప్లై చేయవచ్చు లేదా పదార్థాలతో కలిపి తినవచ్చు. శరీరంలో పిహెచ్‌ బ్యాలెన్స్‌ సరిచేసి వెంట్రుకల కుదుళ్లను బలపరిచినట్లయితే చుండ్రు సమస్య తగ్గుతుంది. 
 
ఇందుకోసం తడిచిన కుదుళ్లకు బేకింగ్‌ సోడా పట్టించి మర్దన చేయాలి, కొద్ది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే కుదుళ్ల దగ్గర సహజసిద్ధమైన తేమ పోకుండా నిలిచి ఉంటుంది. కలబంద పొడిబారిన కుదుళ్లకు మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. 
 
దీనిలోని యాంటీసెప్టిక్‌ గుణాలు చుండ్రును పెంచే బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఇంకా యాస్ర్పిన్‌లో అసిటైల్‌సిలిసిలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను చంపి, మృత చర్మాన్ని వదిలిస్తుంది. రెండు మాత్రలు పొడిచేసి, షాంపూతో కలిపి తల రుద్దుకుని స్నానం చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com