ఏపీ:మండలి రద్దుకు కేబినెట్ ఆమోదం
- January 27, 2020
ఏపీ:ముందు నుండి చెబుతున్నట్లుగా ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశమే ప్రధానం అజెండాగా సమావేశమైన కేబినెట్ తొలి అంశంగా దీని పైనే చర్చ చేసింది. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే మండలి పరిణామాల పైన ముఖ్యమంత్రి మంత్రుల అభిప్రాయాలు సేకరించారు. ప్రజా మేలు కోసం తీసుకొనే నిర్ణయాలకు అడ్డు చెప్పే మండలి అవసరం లేదని పలువురు మంత్రులు సూచించారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.
దీంతో..కేబినెట్ ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నిర్ణయం మేరకు కాసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి తీర్మానం ప్రతిపాదిస్తారు. ప్రతిపక్షం టీడీపీ గైర్హాజరు కావాలని నిర్ణయించింది. అయినా.. ప్రభుత్వం దీనిపైన చర్చించి..ప్రతిపక్షం అభిప్రాయంగా జనసేన ఎమ్మెల్యే చెప్పే అంశాలను రికార్డు చేయనున్నారు. దీని పైన చర్చ తరువాత మండలి రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ
ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది.
ప్రభుత్వం అనుకున్న విధంగానే ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. తొలుత సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవ టం వెనుక కారణాలను సహచర మంత్రులకు వివరించారు. మండలిలో సభ్యులుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న డిప్యూటీ సీఎం బోస్..మోపిదేవి ముందుగా మండలి రద్దుకు తమ మద్దతు ఉంటుందని కేబినెట్ లో ముఖ్యమంత్రికి స్పష్టం చేసారు. మిగిలిన మంత్రులు సైతం సీఎం నిర్ణయం సరైనదేనంటూ మద్దతిచ్చారు. దీంతో..తొలి అంశంగానే మండలి రద్దుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనికి అనుగుణంగానే ఇదే రోజు అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. దీని ద్వారా 2007లో వైయస్సార్ ప్రభుత్వంలో పునరుద్దరించిన ఏపీ శాసనమండలి ఆయన తనయుడి ప్రభుత్వంలో రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక, కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం వెళ్లనుంది. కేంద్రం ఎప్పటి లోగా దీని పైన తుది నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కర అంశం. అప్పటి వరకు మండలి సమావేశాలు..సెలెక్ట్ కమిటీ తమ విధులు తాము కొనసాగిస్తాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!