8 కిలోలకు పైబడిన క్యాబిన్ లగేజ్‌కి ఛార్జీ
- January 27, 2020
ఒమన్ నుంచి ఎయిర్ ఇండియా విమానాల్లో వచ్చే ప్రయాణీకులకు 8 కిలోల లిమిట్ మించితే క్యాబిన్ లగేజ్‌కి ఛార్జీ వర్తిస్తుంది. మస్కట్‌లో ఎయిర్ ఇండియా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఓవర్ వెయిట్ హ్యాండ్ బ్యాగేజీ ఇకపై ఛార్జ్ చేయబడుతుందనేది ఆ ప్రకటన సారాంశం. డ్యూటీ ఫ్రీ షాప్స్‌లో కొనుగోలు చేసే వస్తువులకూ ఇది వర్సించనుంది. ప్రతి అదనపు కిలోగ్రామ్‌కీ 6 ఒమన్ రియాల్స్ ఛార్జ్ వసూలు చేస్తారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబిన్ లగేజ్ బరువు 10 కిలోలకు మించరాదు. ఇందులో 8 కిలోల బ్యాగేజ్ ఉచితం కాగా, రెండు కిలోలకి అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. 10 కిలోల బరువు మించితే క్యాబిన్‌లోకి అనుమతించరు లగేజ్‌ని. అలాగే హ్యాండ్ బ్యాగేజీ 55 సెంటీమీటర్ల ఎత్తు, 35 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల వెడల్పుని మించకూడదు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!