ప్రముఖ బుల్లితెర నటుడు హఠాత్మరణం..
- January 27, 2020
బెంగళూరు:గత కొద్దికాలంగా సినీ ఇండస్ట్రీని విషాదాలు అలుముకున్నాయి. తాజాగా కన్నడ బుల్లితెర నటుడు, హోస్ట్ సంజీవ్ కులకర్ణి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై అకాల మరణం చెందారు. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
ప్రముఖ కన్నడ సీరియల్స్ నాగిని.. రాజారాణి.. ఏటు-ఎదురీతతో సంజీవ్ కులకర్ణి ప్రేక్షకుల సుపరిచితుడు. కొద్దికాలంగా ఆయన కార్డియోమయోపతితో బాధపడుతున్నారు. దీనికి నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. సంజీవ్ కులకర్ణి కుమారుడు సౌరభ్ కూడా నటుడే.
ఇక ప్రతీ నెలా సంభ్రమ- సౌరభ పేరుతో సంజీవ్ కులకర్ణి ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చేవారు. కాగా, ఆయన మరణవార్త విన్న పలువురు టీవీ, సినీ రంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







