షార్జాలో కొత్త గ్యాస్‌ ఫీల్డ్‌

షార్జాలో కొత్త గ్యాస్‌ ఫీల్డ్‌

షార్జా నేషనల్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఇటాలియన్‌ పార్టనర్‌ ఇఎన్‌ఐతో కలిసి కొత్త నేచురల్‌ గ్యాస్‌ ఫీల్డ్‌ని కనుగొన్నట్లు ప్రకటించింది. మహాని ఫీల్డ్‌ ఆన్‌ షోర్‌ వద్ద దీన్ని కనుగొన్నారు. రోజుకి 50 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ ఫీట్‌ సామర్థ్యం ఈ గ్యాస్‌ ఫీల్డ్‌కి వున్నట్లు ప్రతినిథులు వివరించారు. 1980 తర్వాత ఇదే తొలి ఆన్‌ షోర్‌ గ్యాస్‌ ఫీల్డ్‌ కావడం గమనార్హం. 14,597 అడుగుల లోతున మహాని 1 వెల్‌ని డ్రిల్‌ చేశారు.

Back to Top