ఒమన్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

ఒమన్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

మస్కట్‌: సుల్తానేట్‌లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా తగ్గుతాయని ఒమన్‌ మిటియరాలజీ పేర్కొంది. సైక్‌లో 1 డిగ్రీ సెల్సియస్‌, సలాలాలో 28 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయి. కాగా, కసబ్‌లో 19 డిగ్రీలు, ఇబ్రిలో 19 డిగ్రీలు, బురైమిలో 20 డిగ్రీలు, ఇబ్రా మరియు రుస్తాక్‌లో 20 డిగ్రీలు, ముస్తాక్‌లో 21 డిగ్రీలు, సుహార్‌, సుర్‌, హైమా మరియు నిజ్వాలో 22 డిగ్రీలు, మాసిరాలో 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు వుంటాయి. ఒమన్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిసే అవకాశం వుంది.

Back to Top