బహ్రెయిన్:గవర్నమెంట్ హౌజింగ్ యూనిట్స్ లో నిబంధల ఉల్లంఘన

- January 28, 2020 , by Maagulf
బహ్రెయిన్:గవర్నమెంట్ హౌజింగ్ యూనిట్స్ లో నిబంధల ఉల్లంఘన

బహ్రెయిన్:గవర్నమెంట్ హౌజింగ్ యూనిట్స్ లబ్ధిదారులు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు హౌజింగ్ మినిస్ట్రీ తనఖీల్లో వెలుగు చూసింది. దాదాపు 700 ఇళ్లలో వయోలేషన్ జరిగినట్లు నిర్ధారించింది. ఇంజనీరింగ్ ఎర్రర్స్ తో పాటు లబ్ధిదారులు తమ ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు చేశారు. ఈ మార్పులు బిల్డింగ్ లైఫ్ ముప్పుగా మారాయని హౌజింగ్ మినిస్ట్రీ ఇన్స్ పెక్టర్స్ గుర్తించారు. మొత్తం 774 యూనిట్లలో సీరియస్ వయోలేషన్ జరిగింది. హౌజింగ్ యూనిట్లలో చేసిన మార్పుల వల్ల వాటర్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ డ్యామేజ్ తో పాటు గోడలకు క్రాక్స్ ఏర్పడ్డాయి. డ్రైనేజీ సిస్టమ్ లో ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తోందని టెక్నికల్ టీం గుర్తించింది. సల్మాన్ సిటీ 67 చోట్ల, అల్ హిడ్ లో 63, తుబ్లి ప్రాజెక్ట్ లో 19, లాజి ప్రాజెక్ట్ లో 79, నార్త్ ఈస్ట్ ముహరఖ్ ప్రాజెక్ట్ లో 131, సిత్ర ప్రాజెక్ట్ లో 155 యూనిట్లలో వయోలేషన్స్ జరిగిట్లు హౌజింగ్ మినిస్ట్రి అధికారులు వివరించారు. ఇకపై ఎవరైనా లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో మార్పులు చేయాలనుకుంటే అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అధికారులు సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com