దుబాయ్ లో వెలుగుచూసిన ఘటన
- January 28, 2020
దుబాయ్: దుబాయ్ లోని ఓ హోటల్లో పనిచేస్తున్న వెయిటర్ అదే హోటల్లో 3500 దిర్హామ్(రూ. 68 వేలు)లు దొంగతనం చేసి దొరికిపోయాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన 25 ఏళ్ల వెయిటర్ హోటల్ మూసేసిన తరువాత క్యాష్ బాక్స్ నుంచి డబ్బును దొంగిలించాడు. ఎదురుగా సీసీ కెమెరా ఉందనే విషయం గుర్తొచ్చి అనంతరం కెమెరా పవర్‌ను కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పవర్ కట్ చేస్తే తాను దొంగతనం చేసింది రికార్డ్ అవ్వదేమోనని వెయిటర్ అనుకున్నాడు.
అనంతరం క్యాష్ బాక్స్ చూసిన భారతీయ క్యాషియర్ ఒక్కసారిగా షాకయ్యాడు. హోటల్లోని ఇతర సిబ్బందిని అడగగా.. వారికి తెలీదని సమాధానమిచ్చారు. దీంతో సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. హోటల్లో పనిచేసే వెయిటర్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు రికార్డయింది. కాగా.. దొంగతనం చేసిన మూడు రోజుల తరువాత వెయిటర్ హోటల్‌కు వెళ్లాడు. తాను దొంగతనం చేసిన డబ్బును తిరిగి ఇచ్చేస్తానంటూ క్యాషియర్‌కు వివరించాడు. హోటల్ యాజమాన్యం మాత్రం వెయిటర్‌పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు