ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రంగా రికార్డులు సృష్టిస్తోంది ఈ ధ్యాన మందిరం

- January 28, 2020 , by Maagulf
ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రంగా రికార్డులు సృష్టిస్తోంది ఈ ధ్యాన మందిరం

ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రంగా రికార్డులు సృష్టిస్తోంది హైదరాబాద్ లోని ధ్యాన మందిరం.. మంగళవారం నుంచి నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముఖ్య అతిథిగా హాజరై.. ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. శంషాబాద్ సమీపంలోని కన్హ గ్రామంలో.. హార్ట్‌ ఫుల్‌నెస్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ ధ్యాన మందిర నిర్మాణం జరిగింది. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ధ్యానమందిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిని తాబేలు ఆకారంలో నిర్మించారు. దీనిలో ఒకేసారి లక్షమంది ధ్యానం చేసేందుకు వీలుగా దీనిని నిర్మించారు. హార్ట్‌ ఫుల్‌నెస్‌ సంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ ధ్యానకేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com