సిరియా లో భారతీయుడికి 3 నెలల జైలు శిక్ష

- January 28, 2020 , by Maagulf
సిరియా లో భారతీయుడికి 3 నెలల జైలు శిక్ష

కుక్కతోక వంకర అన్న చందంగా ఎక్కడికి వెళ్లినా బుద్ది మారదు. సిరియాకు వెళ్లిన ఓ భారతీయుడు తను చేసిన పనికి ఆ దేశం నుంచి బహిష్కరణకు గురవడంతో పాటు 3 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. స్వదేశంలో సాగినట్లే విదేశంలో కూడా తన ఆటలు సాగుతాయనుకున్నాడు. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి మాల్‌కి వెళ్లింది. అదే సమయంలో మాల్‌కు వెళ్లిన నిందితుడు ఆమె వైపు అదోలా చూడడం మొదలు పెట్టాడు. అంతటితో ఊరుకోకుండా ఆమెపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె.. అతడిని అరిచి గొడవకు దిగింది. మాల్ సిబ్బంది, కస్టమర్లు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించిన పోలీసులు నిందితుడు ఉద్దేశపూర్వకంగా బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించారు. దీంతో నిందితుడికి 3 నెలల జైలు శిక్ష పడింది. శిక్షానంతరం అతడిని భారత్‌కు తిరిగి పంపేయనున్నట్లు కోర్టు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com