యూఏఈ లో మొదటి కరోనా వైరస్ కేసు నమోదు
- January 29, 2020
యూఏఈ: చైనా నగరమైన వుహాన్ నుండి యూఏఈ వచ్చిన కుటుంబ సభ్యులలో కరోనావైరస్ గుర్తించినట్టు పైగా ఇది యూఏఈ యొక్క మొదటి కరోనా వైరస్ కేసు గా ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ మోహాప్ ప్రకటించింది.
బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, "వైరస్ సోకిన వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది మరియు వారు ప్రస్తుతం వైద్య పరిశీలనలో ఉన్నారు" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆరోగ్య అధికారులు మరియు దేశంలోని సంబంధిత అధికారుల సమన్వయంతో, "ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన శాస్త్రీయ సిఫార్సులు, షరతులు మరియు ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు" తీసుకున్నట్లు MoHAP ధృవీకరించింది.
వైరస్ యొక్క ఏవైనా కేసులను ముందస్తుగా నివేదించడానికి దేశంలోని ఎపిడెమియోలాజికల్ దర్యాప్తు కేంద్రాలు 24*7 పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది, దేశంలో ఆరోగ్య వ్యవస్థ "చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని మరియు మంత్రిత్వ శాఖ పరిస్థితిని దగ్గరగా అనుసరిస్తోందని పేర్కొంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం మరియు భద్రతకు హామీ ఇస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!