బహ్రెయిన్ : ప్రమాదకరంగా మారుతున్న వర్షపు నీటి గొయ్యిలు..4 ఏళ్ల బాలుడికి తప్పిన ముప్పు

- January 29, 2020 , by Maagulf
బహ్రెయిన్ : ప్రమాదకరంగా మారుతున్న వర్షపు నీటి గొయ్యిలు..4 ఏళ్ల బాలుడికి తప్పిన ముప్పు

వర్షపు నీరు వెళ్లేందుకు తాత్కాలికంగా చేపట్టిన రెయిన్ వాటర్ పిట్స్ స్థానికులు, చిన్నారులకు ముప్పుగా మారుతోంది. బుసైతీన్ లోని అల్ సయాహ్ ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు వర్షపు నీటి గొయ్యిలో పడ్డాడు. సమయానికి అతని బంధువులు, స్థానికులు గమనించి రక్షించటంతో ప్రాణాపాయం తప్పింది. చికిత్స కోసం బాలుడ్ని వెంటనే కింగ్ హమద్ ఆస్పత్రికి తరలించారు. అయితే..రెయిన్ వాటర్ డ్రైనేజీ నెట్వర్క్ కోసం మత ప్రాంతంలో టెంపరరీగా తవ్విన గుంతలు ప్రమాదకరంగా మారాయని..వాటిని పూడ్చేయాలని కొంత కాలంగా బాలుడి తండ్రి మినిస్ట్రి ఆఫ్ వర్క్స్, మున్సిపల్ అఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ అధికారులను కోరుతున్నారు. అయినా సిబ్బంది పట్టించుకోలేదని మున్సిపల్ రిప్రజెంటీవ్ ఒకరు తెలిపారు. ఒక వేళ గుంతల కారణంగా ఎవరికైనా జరగరానిది జరిగితే మినిస్ట్రి ఆఫ్ వర్క్స్, మున్సిపల్ అఫైర్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బుసైతీన్ లోని 228 కాంప్లెక్స్ చాలా ప్రెస్టేజియస్ కాంప్లెక్స్ లలో ఒకటి. అయితే..తీసిన గుంతలు రెయిన్ వాటర్ డ్రైనేజీ నెట్వర్క్ తో లింక్ చేయటంలో అధికారులు ఫెయిల్ అయ్యారు. నీటి గొయ్యి కారణంగా దోమలు విస్తరిస్తున్నాయని, పిల్లలు అందులో పడే ప్రమాదం పొంచి ఉందని స్థానికుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com