మస్కట్:మెడికల్ ఎవాక్యూషన్ డ్రిల్ నిర్వహించిన రాయల్ హస్పిటల్, RAFO

- January 30, 2020 , by Maagulf
మస్కట్:మెడికల్ ఎవాక్యూషన్ డ్రిల్ నిర్వహించిన రాయల్ హస్పిటల్, RAFO

మస్కట్:రాయల్ హస్పిటల్, ది రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ -RAFO సంయుక్తంగా మెడికల్ ఎవాక్యూషన్ డ్రిల్ నిర్వహించాయి. అత్యవసర పరిస్థితుల్లో పేషంట్లకు, గాయపడిన వారికి వేగంగా చికిత్స అందించేందుకు ఈ డ్రిల్ ఎంతగానో తోడ్పడనుంది. హెలికాఫ్టర్ ద్వారా పేషెంట్లను, గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించటంతో పాటు పారామెడికల్ టీమ్స్ ను స్పాట్ కు తీసుకెళ్లటంలోనూ ఈ డ్రిల్ లో శిక్షణ ఇచ్చారు. మినిస్ట్రి ఆఫ్ డిఫెన్స్, సుల్తానేట్ లోని హెల్త్ ఇన్సిట్యూట్స్ కోఅపరేషన్ తో డ్రిల్ నిర్వహించారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని RAFO ఈ డ్రిల్ ద్వారా చాటింది. ఇక నుంచి  గవర్నమెంట్ హెల్త్ ఇన్సిట్యూషన్స్ కు ఎయిర్ సర్వీస్ అందించేందుకు తాము సిద్ధమని RAFO అధికారులు తెలిపారు. అంతకుముందు లెక్చర్ హాల్ లో జరిగిన థియరీ లెక్చర్ లో పేషెంట్లను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రెస్క్యూ మెకానిజమ్ పై లెక్చర్ ఇచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com