హైదరాబాద్:మెట్రో ప్రయాణీకులకు శుభవార్త..!
- January 30, 2020
హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కొత్తగా కారు, బైక్ పూలింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. దీని కోసం రెడ్‌బస్ సంస్థతో డీల్ కుదుర్చుకుంది. సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 'ప్రయాణీకులు తమ గమ్యస్థలాలకు వెళ్లడం కోసం ఈ సర్వీసులు రెడ్‌బస్‌తో అనుసంధానం అయిన 'ఆర్-పూల్' అనే రైడ్ షేరింగ్ యాప్ ద్వారా పొందవచ్చునని చెప్పారు.
ఇక ఈ కారు/బైక్ పూలింగ్ వల్ల ట్రాఫిక్ రద్దీని తగ్గించే అవకాశం ఉంటుందని.. ఆఫీసులకు వెళ్లేవారికి ఇది మరింత సౌకర్యాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఈ విధానం ద్వారా ఎక్కువగా ఉన్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ప్రయాణించడానికి ఒక కిలోమీటర్‌కు కేవలం రూ.2 చెల్లిస్తే సరిపోతుందని మెట్రో సంస్థ ఎండీ తెలిపారు. ఇక వీటి కోసం ప్రతీ మెట్రో స్టేషన్ దగ్గర కొంత స్థలం కేటాయించామన్నారు. కాగా, 'ఆర్-పూల్' కస్టమర్లకు సుమారు 1,000 మెట్రో స్మార్ట్ కార్డులను కూడా అందిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!