స్పైనల్ స్ట్రోక్: సాయం కోరుతున్న భారత యువకుడు
- January 30, 2020
బహ్రెయిన్:20 ఏళ్ళ భారత యువకుడు ఒకరు బహ్రెయిన్‌లో అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నారు.సెగాయాలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ముహ్‌సిన్ అనే యువకుడు, ఆరు నెలల క్రితమే బహ్రెయిన్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాకి చెందిన యువకుడు ముహ్‌సిన్, ఇటీవల అనారోగ్యానికి గురికాగా, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, అతనకు స్పైనల్ స్ట్రోక్ వచ్చినట్లు తేల్చారు.ప్రస్తుతం అతను కొంత మేర కోలుకున్నా, సాధారణ జీవితాన్ని పొందడానికి ఇంకొంత వైద్య చికిత్స అవసరం.పేద కుటుంబానికి చెందిన ముహ్‌సిన్, దాతల నుంచి ఆర్థిక సాయం కోరుతున్నారు.పలువురు వలసదారులు కమిటీగా ఏర్పడి, ముహ్‌సిన్‌కి సాయం అందించేందుకు ముందుకొచ్చారు.డాక్టర్ పివి చెరియన్, సోషల్ వర్కర్స్ సుబైర్ కన్నుర్,కెటి సలీమ్ మరియు నాసర్ మంచెర్రి తదితరులు ఈ బాధ్యతను స్వీకరించారు.సాయం చేయాలనుకున్నవారు 35476523కి ఫోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







