ఈయూ నుంచి వేరుపడిన బ్రిటన్..
- February 01, 2020
లండన్: బ్రిటన్ వేరు కాపురం ఆరంభమైంది. ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి విడిపోవాలన్న ప్రజాభీష్టం నెరవేరింది. బ్రిటన్ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలు, భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చింది. మూడున్నర ఏళ్ల క్రితం నిర్వహించిన రెఫరెండంలో 52ు ప్రజలు బ్రెగ్జిట్ వైపే మొగ్గు చూపారు. ఎన్నో అవాంతరాల మధ్య అది చట్టంగా మారడానికి ఇన్నేళ్లు పట్టింది.
ఈయూ నుంచి వేరుపడిన తొలి దేశం బ్రిటనే! ఈయూతో 47 ఏళ్ల అనుబంధాన్ని తెగదెంపులు చేసుకోవడం ద్వారా ప్రపంచదేశాలతో సరికొత్తగా వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు అమిత స్వేచ్ఛ లభిస్తుంది. ఈయూ నుంచి వేరుపడటం అంతం కాదని, ఇదో కొత్త ఆరంభమని జాన్సన్ స్పష్టం చేశారు. బ్రిటన్ చరిత్రలో మరో నూతనాధ్యాయం మొదలైందని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో జాన్సన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు