కువైట్:జైలు నుంచే స్కెచ్..రాయల్స్, బిజినెస్ పర్సన్స్ కు లక్షల్లో టోకరా
- February 01, 2020
కువైట్:ఎనిమిది మంది టీం. జైలు నుంచే స్కెచ్. మాయమాటలు చెప్పి రాయల్స్ తో పాటు బిజినెస్ పర్సన్స్ ని బురిడి కొట్టించి కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ బిగ్ ఫ్రాడ్ కేసులో విచారణను క్రిమినల్ కోర్టు మార్చి 11వ తేదికి వాయిదా వేసింది. మొత్తం KD2,593,399 మనీ లాండరింగ్ పాల్పడినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ప్రధాని నిందితుడితో ఏడుగురు నిందితులు పలు చీటింగ్ కేసుల్లో జైలులో ఉన్నారు. అయితే..ఓ మహిళలను 400,000 కువైట్ దినార్ లను ఫ్రాడ్ చేసిన కేసులో నిన్న క్రిమినల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తన వాదన వినిపించిన బాధితురాలు ఓ రిప్రజెంటీవ్ ద్వారా వస్తువులు కొనేందుకు 400,000 కువైట్ దినార్ ల చెక్ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే..తనకు లగ్జరీ కార్ తో పాటు విలువైన గిఫ్ట్స్ ఇచ్చారని, డబ్బులు కూడా తిరిగి ఇస్తానని నిందితులు తనతో చెప్పారని ఆమె కోర్టుకు వివరించింది. అయితే..నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా మోసానికి పాల్పడినట్లు కూడా పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ చెబుతోంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







