ఖతార్ ట్రాన్స్ పోర్ట్ హిస్టరీని చాటేలా వింటేజ్ కార్ ఎగ్జిబిషన్

- February 01, 2020 , by Maagulf
ఖతార్ ట్రాన్స్ పోర్ట్ హిస్టరీని చాటేలా వింటేజ్ కార్ ఎగ్జిబిషన్

దోహా:ఖతార్ లో దశాబ్దాల తరబడి ఉంటున్న వారికి మళ్లీ పాత రోజులు గుర్తుకు వచ్చేలా వింటేజ్ కార్ ఎగ్జిబిషన్ ఆకర్షిస్తోంది. 70, 80వ దశాకాల్లో వాడిన వాహనాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు పెట్టారు. మవాటర్ సెంటర్ వేదికగా జనవరి 31 నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్...ఖతార్ ట్రాన్స్ పోర్ట్ చరిత్రను జీవనశైలిని గుర్తు చేస్తుందని నిర్వహకులు చెబుతున్నారు. మొత్తం మూడు విభాగాల ఎగ్జిబిషన్ డివైడ్ చేశారు. యాభై ఏళ్ల క్రితం వినియోగంలో ఉన్న ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్, ప్రైవేట్ కార్స్, గవర్నమెంట్ వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. ఎగ్జిబిషన్ ఎంట్రెన్స్ లోనే పాత తరం ట్యాక్సీ కారు, 70వ దశకంలో మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ ఉపయోగించిన మెరూన్ స్కూల్ బస్సు , గవర్నమెంట్ అధికారులు, మంత్రులు ఉపయోగించిన కార్లు ఎంట్రెన్స్ లోనే వెల్ కం చెబుతున్నాయి. ఫిబ్రవరి 29 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com