రాస్ అల్ ఖైమా:భార్యను చంపిన భర్తకు 15 ఏళ్ళ జైలు భారీ జరిమానా
- February 01, 2020
రాస్ అల్ ఖైమా:రాస్ అల్ ఖైమా లో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేసిన భర్త..ఆ నేరం తనపై రాకుండా ఉండేందుకు పెద్ద నాటకానికి తెర లేపాడు.భార్య ఇంట్లో ఉండగా జరిగిన అగ్ని ప్రమాదం వల్ల మృతిచెందినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె ప్రమాదం జరగడానికి ముందే హత్య గావింపబడినట్టు తేలింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు.తాజాగా నిందితుడిని రాస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు.విచారణ అనంతరం భర్తను దోషిగా తేల్చిన న్యాయస్థానం 15 ఏళ్ల జైలు, 2,00,000 దిర్హామ్స్ మృతిరాలి తల్లిదండ్రులకు చెల్లించాలని తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళ్తే...ఈ అరబ్ జంట పెళ్లైనప్పటి నుంచే తరచూ ఘర్షణ పడే వారని సమాచారం. చిన్న చిన్న విషయాలకే భార్యను తీవ్రంగా కొట్టడం, మానసికంగా హింసించడం చేసేవాడు భర్త. చివరకు ఆమె తల్లిదండ్రులతో కూడా మాట్లాడానిచ్చేవాడు కాదు.ఇలా ప్రతిరోజూ ఆమెకు నరకం చూపించేవాడు. ఈ క్రమంలో ఒకరోజు భార్యతో మరోసారి గొడవకు దిగిన అతగాడు.. విడాకుల కోసం ఆమెను తీవ్రంగా కొట్టాడు. దానికి ఆమె అంగీకరించకపోవడంతో ముఖంపై దిండుతో పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ నేరం తనపై రాకుండా ఉండేందుకు ఒక పథకం రంచించాడు.
భార్య మృతదేహాన్ని బెడ్‌రూం నుంచి కిచెన్‌లోకి తీసుకెళ్లి నిప్పుపెట్టాడు.అనంతరం చుట్టుపక్కల వారిని కిచెన్‌లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల తన భార్య చనిపోయిందని నమ్మించాడు.తీరా పోస్టుమార్టం రిపోర్టులో బాధితురాలు ప్రమాదానికి ముందే చనిపోయిందని వచ్చింది. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అతడు తన నేరాన్ని అంగీకరించాడు.తాజాగా ఈ కేసు రాస్ అల్ ఖైమా కోర్టులో విచారణకు వచ్చింది. నిందితుడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం 15 ఏళ్ల జైలు, 2,00,000 దిర్హామ్స్ మృతిరాలి తల్లిదండ్రులకు చెల్లించాలని తీర్పునిచ్చింది.రాస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ డిఫెన్స్ న్యాయవాది యొక్క అభ్యర్ధనను తిరస్కరించింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







