బడ్జెట్ 2020 పూర్తి వివరాలు

- February 01, 2020 , by Maagulf
బడ్జెట్ 2020 పూర్తి వివరాలు
  • ఫర్నిచర్, ఫుట్‌వేర్‌పై కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. పన్ను చెల్లింపుదారుల సమస్యల పరిస్కారానికి ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.5లక్షల కోట్ల మూలధనసాయం. డిపాజిట్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు. గృహారుణాలపై వడ్డీ రాయితీలను అదనంగా రూ.1.5 లక్షలకు పెంచింది.
  • విద్యుత్పాదక పరిశ్రమలకు రాయితీ పన్నుల శాతం 15 శాతం మేర పెంపు. గృహాలకు పన్ను మినహాయింపులు ఏడాది పెంపు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల వార్షిక టర్నోవర్ రూ.కోటి నుంచి రూ.ఐదు కోట్లకు పెంపు.
  • మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారికి ఊరటనిచ్చేలా ఆదాయపు పన్నులో మార్పులు చేపట్టారు. గతంలో వసూలు చేసిన పన్నుల శాతాన్ని కుదించారు. రూ2.5 లక్షలలోపు ఆదాయానికి ఎలాంటి పన్ను లేదు. రూ.5 లక్షలు దాటితే గతంలో 20 శాతంగా ఉన్న పన్నును ఇప్పుడు 10 శాతానికి తగ్గించారు.
  • వేతన జీవులకు ఊరట కలిగించేలా ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్య ఆదాయానికి వసూలు చేస్తున్న పన్నును 20 నుంచి 10 శాతానికి తగ్గించారు. రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం, రూ.12.50 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షల వరకు 25 శాతం, రూ.15 లక్షలు ఆపై ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను వసూలు చేయనున్నారు. ఆదాయపు పన్ను శ్లాబ్‌లు నాలుగు నుంచి ఏడుకు పెంపు.
  • 2020-21 ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ 10 శాతంగా ఉంటుందని అంచనా. . 2020-21 ఏడాదికి ద్రవ్యలోటు 3.9 నుంచి 3.5 శాతానికి కుదింపు .వాణిజ్య బ్యాంకింగ్ పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు.. బ్యాంకుల్లో ఖాతాదారులకు బీమా క్లెయిమ్‌ రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు. జీ20 సదస్సుకు రూ.100 కోట్లు కేటాయింపు.. నేషనల్ మిషన్ ఫర్ క్యాంటమ్ టెక్నాలజీస్‌కు రాబోయే నాలుగేళ్లలో రూ.8 వేల కోట్లు కేటాయింపు.
  • కొత్తగా ఏర్పాటుచేసిన కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్‌కు రూ.30,757 కోట్లు, లడఖ్‌కు రూ.5,598 కోట్లు కేటాయించారు. నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి జాతీయస్థాయిలో రిక్రూట్ వ్యవస్థ ఏర్పాటు.. నగరాల్లో కాలుష్య నివారణకు రూ.4,400 కోట్లు, పర్యాటక రంగానికి రూ.2,500 కోట్లు.
  • సఫాయి కర్మచారీ వ్యవస్థకు స్వస్థి.. జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత. వ్యాపార వర్గాల్లో నమ్మకం పెంచేలా పన్ను చెల్లింపు విధానంలో మార్పులు.
  • రైలు మార్గాలకు ఇరు వైపులా సోలార్‌ కేంద్రాల ఏర్పాటు. పర్యాటక కేంద్రాలతో అనుసంధానం చేస్తూ తేజస్‌ రైళ్లు... 11వేల కిలోమీటర్ల మేర రైల్వే మార్గాల విద్యుదీకరణ. ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు ఏర్పాటు.
  • భారత దేశవ్యాప్తంగా వంద కంటే ఎక్కువ జిల్లాల్లో ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్స్ ఏర్పాటుచేయనున్నారు. వివాహ వయసు మహిళల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.
  • జాతీయ పోషకాహార పథకానికి రూ.35,600 కోట్లు, మహిళలు, శిశువుల పౌష్టికాహారం కోసం రూ.28,000 కోట్లు కేటాయింపులు. షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.85,000 కోట్లు, గిరిజనుల సంక్షేమానికి రూ.53,000 కోట్లు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు రూ.9,500 కోట్లు.
  • భారత దేశంలోని ఐదు పురావస్తు ప్రదేశాలు రాకీగాడీ (హర్యానా), హస్తినాపూర్ (యూపీ), శివసాగర్ (అసోం), దోల్‌వీరా (గుజరాత్), ఆదిత్య నళ్లూరు (తమిళనాడు)లను అభివృద్ధి చేసి, మ్యూజియమన్లను ఏర్పాటుచేయనున్నారు. రాంచీలో ట్రైబల్ మ్యూజియం, లోథాల్‌లో మారిటైమ్ మ్యూజియమ్ ఏర్పాటు చేస్తారు.
  • బెంగళూరులో మెట్రో తరహాలో రూ.18,600 కోట్లతో సబర్బన్ రైల్వే వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు. భారత దేశవ్యాప్తంగా 2 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మాణం.
  • భారత్ నెట్ కార్యక్రమానికి రూ.6,000 కోట్లు.. దీని ద్వారా లక్ష గ్రామాలకు ఫైబర్ నెట్ సేవలను అందజేయనున్నారు. నేషనల్ గ్యాస్ గ్రిడ్‌ను 16,300 కిలోమీటర్ల నుంచి 27 వేల కి.మీ. పెంచనున్నారు.భారత దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్క్‌లను ఏర్పాటుచేయనున్నారు.
  • రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశంలో కొత్తగా ఐదు ఆకర్షణీయ నగరాలను ఏర్పాటుచేయనున్నారు. రవాణాకు రూ.1.4 లక్షల కోట్లు, జౌళి రంగానికి రూ.1,480 కోట్లు, పునరుత్పాదక ఇంధనం పరిశ్రమలకు రూ.22,000 కోట్లు.
  • వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15 లక్షల కోట్లుగా నిర్దేశించామని, ఆల్గే, సీవీ కేజ్‌ కల్చర్‌ విధానంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. కోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమలో మరింత ఉపాధి. 3,400 సాగర్‌మిత్రలను ఏర్పాటుచేయనున్నారు.
  • వ్యవసాయాధారిత పరిశ్రమలు, వాణిజ్యానికి రూ.27,300 కోట్లు కేటాయింపు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సహం. పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు కొత్త విభాగం ఏర్పాటు.
  • విద్యా రంగానికి రూ.99,300 కోట్లు, స్కిల్ డెవలప్‌మెంట్ విభాగానికి రూ.3,000 కోట్లు కేటాయింపులు. ‘ఇండో-శాట్’ ద్వారా ఉన్నత విద్యలో విదేశీ విద్యార్థులకు ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాల నుంచి ప్రవేశకల్పిస్తారు.
  • 2025 నాటికి దేశం నుంచి పూర్తిగా క్షయను నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
  • ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6,400 కోట్లు , గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో 2.83 లక్షల కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్టు తెలిపిన కేంద్ర మంత్రి.
  • 2030 నాటికి ప్రపంచంలోనే ఎక్కువ మంది శ్రామికులున్న దేశంగా భారత్. నూతన ఎడ్యుకేషన్ పాలసీని ప్రకటిస్తాం. విద్యారంగానికి మరిన్ని నిధులు అవసరం. విద్యారంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతి.
  • ఆరోగ్య రంగానికి అదనంగా రూ.69,000 కోట్లు, స్వచ్ఛ భారత్‌కు రూ.12,300 కోట్లు, జలజీవన్ మిషన్‌కు రూ.3.6 లక్షల కోట్లు కేటాయించారు. జలజీవన్ మిషన్ ద్వారా గ్రామీ ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం కల్పించనున్నారు.
  • 2019 నాటికి కేంద్రంపై రుణభారం 48.9 శాతం మేర తగ్గిందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 284 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని అన్నారు.
  • రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి కలిగించి, భూసార పరిరక్షణకు అదనపు సాయం అందజేస్తాం, వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి రైతులకు సహాయంగా గిడ్డంగుల నిర్మాణం చేపట్టునున్నట్టు తెలిపారు.
  • మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యలక్ష్మీ పథకం. మహిళల సాధికారికతకు మేలు చేసేలా ఈ పథకం ఉంటుందన్నారు.
  • భారత దేశంలోని వర్షాభావ జిల్లాలకు నిధులు కేటాయించిన కేంద్రం.. వంద జిల్లాలకు సాగునీటి సౌకర్యాలు కల్పించనుంది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యానికి కట్టుబడి ఉన్నామన్నారు.
  • జాతీయ, అంతర్జాతీయ రూట్లలో కృషి ఉడాన్‌ను ప్రారంభిస్తాం.. రైతుల కోసం కిసాన్ రైలును ప్రారంభించనున్నట్టు తెలిపారు. హార్టికల్ ‌కల్చర్ సెక్టార్‌ ఆహార ధాన్యాల ఉత్పత్తిని దాటిందన్నారు. కిసాన్ రైలు ద్వారా రైతులు పండించిన పంటలను దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా రవాణా చేస్తామన్నారు.
  • మోదీ సర్కారు మొదటి ప్రాధాన్యాంశం: వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి. ద్వితీయ ప్రాధాన్యాంశం ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు. మూడో ప్రాధాన్యాంశం: విద్య, చిన్నారుల సంక్షేమం.
  • భారత దేశంలో డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయని, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద అందరికీ ఇళ్లు నిర్మాణం.. ఇప్పటివరకూ 40 కోట్ల మంది జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేశారన్నారు.
  • జీఎస్టీ శ్లాబుల్లో మార్పులతో సామాన్యులకు మేలు జరిగిందని, 2006 నుంచి 16 మధ్య భారత దేశంలో 22 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐదో ఆర్ధిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకుందన్నారు.
  • భారత దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం, ఆర్థిక పురోగతి, భద్రతతో కూడిన సమాజం (కేరింగ్ సొసైటీ) అనేవి ఈ బడ్జెట్లో మా ప్రాధాన్యాలు. అనేక చెక్‌పోస్టులు తొలగించాం. దీంతో 10 శాతం వరకు పన్ను భారం తగ్గింది. ఏప్రిల్‌ 2020 నుంచి పన్ను చెల్లింపులు మరింత సరళతరం చేస్తాం
  • ఐదేళ్లలో కేంద్రం అప్పులు జీడీపీలో 52.2 శాతం నుంచి 48.70 శాతానికి తగ్గాయి. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. 2006-16 మధ్య దేశంలో 271 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. జీఎస్టీ అమలు తర్వాత సామాన్యులకు నెలవారీ ఆదా 4 శాతం పెరిగిందన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com