బహ్రెయిన్: రేప్ కేసులో వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష
- February 02, 2020
మహిళపై అత్యాచారం చేసి ఆమె మృతికి కారణమైన వ్యక్తికి అత్యున్నత క్రిమినల్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం..నిందితుడు ఆసియా మహిళపై అత్యచారానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాధితురాలు బిల్డింగ్ పై నుంచి దూకటంతో స్పాట్ లోనే మృతి చెందింది. అంతేకాదు గత కొన్నాళ్లుగా బాధితురాలిపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మద్యం సేవించి కొరడాతో చిత్రహింసలకు గురి చేయటం..గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడు. ఘటన జరిగిన రోజు కూడా బాధితురాలిని రేప్ చేశాడు. అతని నుంచి తప్పించుకునేందుకు తాము ఉండే బిల్డింగ్ రూఫ్ నుంచి పక్క బిల్డింగ్ పైకి దూకేందుకు బాధితురాలు ప్రయత్నించింది. కానీ, ఎత్తైన బిల్డింగ్ నుంచి కింద పడటంతో అక్కడిక్కడే చనిపోయింది. ఈ కేసులో వాదనలు పూర్తై నేరం నిరూపణ కావటంతో నిందితుడికి కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..