చెన్నైలో కరోనా కలకలం
- February 02, 2020
చైన్నై: కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రోజు రోజుకు ఈ వైరస్ దేశాలు, రాష్ట్రాలను దాటేస్తోంది.!. చెన్నై ఎయిర్‌పోర్టులో కరోనా వైరస్ కలకలం రేపింది.!. వల్లూజిన్ అనే ప్రయాణికుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చైనాకు చెందిన వల్లూజిన్ అనే వ్యక్తి మలేషియా నుంచి చెన్నై వచ్చాడు. రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా.. మరో వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తికి వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో అతను ఉన్నారు. కాగా ఈ రెండు కేసులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!