కరోనా వైరస్ ఎఫెక్ట్ ... పెంపుడు జంతువులను చంపేస్తున్న చైనీయులు

- February 02, 2020 , by Maagulf
కరోనా వైరస్ ఎఫెక్ట్ ... పెంపుడు జంతువులను చంపేస్తున్న చైనీయులు

చైనా ప్రజలను కరోనా వైరస్ భయం పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ జంతువుల ద్వారా వ్యాపిస్తుందని తేలింది. దీంతో తమ ఇళ్ళలో ఉన్న పెంపుడు జంతువులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. దీంతో భవనాలపైకి తీసుకెళ్లి అక్కడ నుంచి కిందికి తోసి చంపేస్తున్నారు. దీంతో పలు వీధుల్లో చనిపోయిన పెంపుడు జంతువుల కళేభరాలు కనిపిస్తున్నాయి. ఈ వైరస్‌కు చైనాలోని వుహాన్ నగరం కేంద్రంగా ఉన్న విషయం తెల్సిందే. ఈ వ్యాధి బారినపడిన వారిని ప్రత్యేక శిబిరాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే, వైరస్ సోకిన వ్యక్తులతో గడిపిన జంతువులను కూడా క్యారంటైన్‌లలో ఉంచి వైద్యం చేస్తున్నారు.

అయితే, పెంపుడు జంతువుల వల్ల ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని బాగా నమ్మేస్తోన్న చైనా ప్రజలు కుక్కలను, పిల్లులను తాముంటున్న అపార్ట్‌మెంట్ల మీద నుంచి కిందకు పడేస్తున్నారు. దీంతో అవి చనిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వస్తున్నాయి. జంతువును చంపకూడదని అక్కడడి ప్రభుత్వం సూచనలు చేస్తోంది. కుక్కలు, పిల్లులతో కరోనా వ్యాపిస్తుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com