అపార కుబేరుని కుమార్తె ప్రేమ వివాహం
- February 02, 2020
ఓ హార్స్ రేసర్ ప్రపంచ కుబేరుడుకానున్నాడు. దీనికి కారణం అతను ప్రేమవివాహం చేసుకునేందుకు సిద్ధం కావడమే. ఇంతకీ అతను ప్రేమించిన యువతి ఎవరో కాదు.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ముద్దులకుమార్తె. పేరు జెన్నీఫర్ గేట్స్ (23). ఈమె హార్స్ రేసర్ నాయెల్ నాసర్ (29)ను ప్రేమించింది. వీరిద్దరి ప్రేమ వివాహానికి బిల్ గేట్స్ సమ్మతించారు.
పైగా, వీరిద్దరి నిశ్చితార్థాన్నికూడా బిల్ గేట్స్ మంచు కొండల్లో అంగరంగ వైభవంగా జరిపించాడు. ఇపుడు దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై జెన్నీఫర్ గేట్స్ స్పందిస్తూ, తామిద్దరమూ ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నామని, భవిష్యత్తులో ప్రేమను పంచుకుంటూ ముందడుగు వేస్తామని వ్యాఖ్యానించారు. ఆమె పోస్ట్‌కు వేలకొద్దీ లైక్స్ రాగా, ఎంతో మంది అభినందనలు తెలుపుతున్నారు.
ఇక ప్రపంచంలో తనలాంటి అదృష్టవంతుడు మరొకరు ఉండబోరంటూ నయెల్ నాసర్ చెప్పడం కొసమెరుపు. నాసర్ పేరెంట్స్ ఈజిప్ట్ నుంచి వచ్చి యూఎస్‌లో స్థిరపడగా, నాసర్ చికాగోలో జన్మించాడు. అతనికి ఈజిప్టు పౌరసత్వం ఉన్న కారణంగా, హార్స్ రేస్ పోటీల్లో ఈజిప్ట్ తరపున 2020 ఒలింపిక్స్‌లో సైతం ఆడారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







