అపార కుబేరుని కుమార్తె ప్రేమ వివాహం

- February 02, 2020 , by Maagulf
అపార కుబేరుని కుమార్తె ప్రేమ వివాహం

ఓ హార్స్ రేసర్ ప్రపంచ కుబేరుడుకానున్నాడు. దీనికి కారణం అతను ప్రేమవివాహం చేసుకునేందుకు సిద్ధం కావడమే. ఇంతకీ అతను ప్రేమించిన యువతి ఎవరో కాదు.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ముద్దులకుమార్తె. పేరు జెన్నీఫర్ గేట్స్ (23). ఈమె హార్స్ రేసర్ నాయెల్ నాసర్‌ (29)ను ప్రేమించింది. వీరిద్దరి ప్రేమ వివాహానికి బిల్ గేట్స్ సమ్మతించారు.

పైగా, వీరిద్దరి నిశ్చితార్థాన్నికూడా బిల్ గేట్స్ మంచు కొండల్లో అంగరంగ వైభవంగా జరిపించాడు. ఇపుడు దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై జెన్నీఫర్ గేట్స్ స్పందిస్తూ, తామిద్దరమూ ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నామని, భవిష్యత్తులో ప్రేమను పంచుకుంటూ ముందడుగు వేస్తామని వ్యాఖ్యానించారు. ఆమె పోస్ట్‌కు వేలకొద్దీ లైక్స్ రాగా, ఎంతో మంది అభినందనలు తెలుపుతున్నారు.

ఇక ప్రపంచంలో తనలాంటి అదృష్టవంతుడు మరొకరు ఉండబోరంటూ నయెల్ నాసర్ చెప్పడం కొసమెరుపు. నాసర్ పేరెంట్స్ ఈజిప్ట్ నుంచి వచ్చి యూఎస్‌లో స్థిరపడగా, నాసర్‌ చికాగోలో జన్మించాడు. అతనికి ఈజిప్టు పౌరసత్వం ఉన్న కారణంగా, హార్స్ రేస్ పోటీల్లో ఈజిప్ట్ తరపున 2020 ఒలింపిక్స్‌లో సైతం ఆడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com