చైనాలో మరో భయంకర వైరస్‌!

- February 02, 2020 , by Maagulf
చైనాలో మరో భయంకర వైరస్‌!

బీజింగ్‌: ఇప్పటికే కరోనాతో విలవిలలాడిపోతున్న చైనాలో మరో భయంకర వైరస్‌ వెలుగుచూసింది. తాజాగా బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లను కూడా గుర్తించినట్లు ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రి వెల్లడించారు. కరోనాకు కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సు దక్షిణాన ఉన్న హునన్‌ ప్రావిన్సులో బర్డ్‌ ఫ్లూకు కారణమయ్యే హెచ్‌5ఎన్‌1 వైరస్‌ గుర్తించినట్లు తెలిపారు. షయోయాంగ్‌ నగరం శివారులోని ఓ కోళ్లఫారమ్‌లో ఈ వైరస్ ధాటికి ఇప్పటి వరకు 4500 కోళ్లు మరణించినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని మిగతా వాటిని వేరుచేశారు. ఫ్లూ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు మనుషులెవరూ ప్రభావితం కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com