మ్యాగ్నటిక్ చిప్ తో కార్ రిజిస్ట్రేషన్ బుక్..చిప్ లోనే ఇక ఓనర్ ఫుల్ ఇన్ఫర్మేషన్

- February 03, 2020 , by Maagulf
మ్యాగ్నటిక్ చిప్ తో కార్ రిజిస్ట్రేషన్ బుక్..చిప్ లోనే ఇక ఓనర్ ఫుల్ ఇన్ఫర్మేషన్

కువైట్: మీ కార్ రిజిస్ట్రేషన్ బుక్ ఇప్పుడు కేవలం ఓ పేపర్ పీస్ మాత్రమే కాదు. వెహికిల్ ఓనర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ బుక్ లో ఫీడ్ అయి ఉంటుంది. ఏటీం కార్డ్ తరహాలోనే ఆర్సీ బుక్ లో మ్యాగ్నటిక్ చిప్ ను అమర్చనున్నారు. దీంతో వెహికల్ ఓనర్ ఇన్ఫర్మేషన్ అరబిక్, ఇంగ్లీష్ ల్యాంగ్వేజెస్ లో ఫీడ్ అయి ఉంటుంది. ఆర్సీ బుక్ లో మ్యాగ్నటిక్ చిప్ అమర్చటం ద్వారా వెహికిల్ ఓనర్స్ తమ కార్ లో ఫారెన్ కంట్రీస్ కి ట్రావెల్ చేసినా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎటీఎం కార్డు తరహాలో ఆర్సీ బుక్ ఉంటుంది కాబట్టి..మీ వాలెట్ లో కూడా క్యారీ చేయవచ్చు. డ్యామేజ్ కాకుండా చాన్నాళ్ల పాటు భద్రపర్చుకోవచ్చని ట్రాఫిక్ అఫేర్స్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ జమాల్ అల్ సయోఘ్ తెలిపారు. అయితే..ఆర్సీ బుక్ లో వైట్ బాటమ్ పార్ట్ ను తొలగించకూడదని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. దీనిపై వెహికిల్ ఓనర్స్ కి అవగాహన కల్పించాల్సిందిగా సంబంధిత అధికారులకు సర్క్యూలర్ జారీ చేశారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com