మిడతలపై పోరుకు సిద్ధమవుతున్న పాక్‌

- February 03, 2020 , by Maagulf
మిడతలపై పోరుకు సిద్ధమవుతున్న పాక్‌

భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల రైతులకు కొత్త సమస్య వచ్చిపడింది. పాకిస్థాన్ నుంచి భారత్ వైపు దూసుకువస్తున్న మిడతలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. చేతికొచ్చిన పంటను మిడతల దండు కత్తిరించి వేస్తున్నాయి. పాక్‌ లోని పంజాబ్ ఫ్రావిన్స్ నుంచి భారత భూభాగంలోకి వస్తున్నట్లు గుర్తించారు. పంజాబ్‌తో పాటూ రాజస్థాన్లోని 12 జిల్లాల్లో మిడతల ప్రభావం ఎక్కువగా ఉంది. అటు పాకిస్థాన్ లో కూడా మిడతల దండు బీభత్సం సృష్టిస్తోంది..దీనిపై ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించింది పాక్ ప్రభుత్వం.

ఇటు మిడతల దండును తరిమేందుకు రైతులు పెద్ద శబ్దంతో పాటలు పెట్టడం, ఫైర్ ట్యాంకర్ల సాయంతో కెమికల్స్ స్ర్పే చేయడం వంటి నివారణ చర్యలు పాటిస్తున్నారు. ఇక మిడతలపై పొరుకు పాక్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సర్కారు జాతీయ సత్వర ప్రణాళికకు 730 కోట్లు కేటాయించింది.. మిడతల సమస్య నుంచి రైతులను బయటపడేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు. మిడతల దాడితో సింధ్ ప్రావిన్స్ లో పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com