'పవిత్రమైన నూనె' కోసం తొక్కిసలాట..20 మంది మృతి .!
- February 03, 2020

ఓ మత బోధకుడిపై పెట్టుకున్న గుడ్డినమ్మకం కారణంగా 20 మంది ప్రాణాలు విడిచారు.. 16 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.. టాంజానియాలోని మోషి టౌన్లో ఎవాంజెలికల్ క్రిస్టియన్ చర్చి ఉంది.. అందులో బోనిఫేస్ వాంపోసా అనే ఓ మత బోధకుడు ప్రార్థన కార్యక్రమం పెట్టాడు.. పెడితే పెట్టాడు కానీ… అనవసరమైన గొప్పలు చెప్పుకున్నాడు.. తాను దైవదూతనన్నాడు..సమస్త వ్యాధులను నయం చేసే పవిత్రమైన నూనె తన దగ్గర ఉందన్నాడు.. ఇంకా చాలా చాలా చెప్పాడు.. నిజమే కాబోలనుకున్నారు జనం… మత బోధకుడు చల్లే పవిత్రమైన నూనె ఎక్కడ తమ మీద పడదోనన్న బెంగతో అందరూ ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు.. ఫలితంగా తొక్కసలాట జరిగింది.. రోగాలు నయమవ్వడం దేవుడెరుగు.. ఆ ఘటనలో 20 మంది ప్రాణాలు విడిచారు.. గాయపడిన 16 మంది నూనె జోలికి పోకుండా హాస్పిటల్లో చేరారు.. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మతబోధకుడు అక్కడి నుంచి బిచాణా ఎత్తేశాడు.. పారిపోయిన అతడిని పోలీసులు వెతికి పట్టుకుని జైల్లో తోశారు.. ఇక టాంజానియా అధ్యక్షుడు మగుఫులి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







