ఎం.ఎస్ రాజు "డర్టీ హరి" రీ-రికార్డింగ్ పనులు మొదలు!!
- February 04, 2020
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న "డర్టీ హరి" చిత్ర రీ-రికార్డింగ్ పనులు మొదలయినట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు.
రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో 'హరి' గా హైదెరాబాదీ కుర్రాడు శ్రవణ్ రెడ్డి పరిచయం అవుతుండగా, జాక్వెలిన్, వసుధ పాత్రల్లో హీరోయిన్లుగా సిమ్రత్ కౌర్ మరియు రుహాణి శర్మ కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన 'డర్టీ హరి' ఫస్ట్ లుక్స్ ఈ చిత్రం ఎంత బోల్డ్ గా ఉండబోతుందో చెబుతుండగా, ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన పేరున్న ప్రొడ్యూసర్/డైరెక్టర్ కి ఇది కంబ్యాక్ చిత్రం అవ్వడంతో భారీ అంచనాల మొదలయ్యాయి.
ఈ సందర్భంగా ఇటీవల జరుగుతున్న రీ-రికార్డింగ్ పనుల్లో భాగంగా తన పాత జ్ఞాపకాల గురించి ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ, 1987 లో తన మొదటి సినిమాకి పని చేసిన కే.వి. మహదేవన్, ఆ తరువాత కలిసి ప్రయాణించిన రాజ్ కోటి, కొత్త తరం సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, మణిశర్మ, చక్రి, కార్తీక్ రాజు మరియు ఇప్పుడు పని చేస్తున్న మార్క్ కే రాబిన్ లని గుర్తుచేసుకుంటూ తన సుదీర్ఘ ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు.
అలాగే ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్న గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో బోల్డ్నెస్ తో పాటు సున్నితమైన భావోద్వేగభరితమైన సన్నివేశాలు కూడా ఉంటాయని. దర్శకుడు రొమాన్స్ ని చాలా పొయెటిక్ గా చూపిస్తున్నారని అన్నారు. అదే సమయంలో నిర్మాణాంతర కార్యక్రమాలని వేగపరుస్తూ, త్వరలోనే చిత్ర టీజర్ ని మరియు రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







