లోక్‌సభ కు 'ఏపీలో మూడు రాజధానులు' వేడి
- February 04, 2020
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్... ఆ దిశగా వైసీపీ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తుండగా... ఏపీ శాసన మండలిలో బ్రేక్‌లు పడ్డాయి. అయితే, ఇప్పుడు ఏపీ రాజధానుల వ్యవహారం కాస్త.. లోక్‌సభను తాకింది.. రాజధానుల వ్యవహారంపై లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ క్లారిటీ ఇచ్చారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఆ రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టం చేసిన ఆయన... రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు. గత ప్రభుత్వ జీవో ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతి ఉందని తెలిపారు. కాగా, ఏపీకి మూడు రాజధానులను రూపొందించుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తూ మీడియా నివేదికలు వచ్చాయని.. లోక్‌సభలో ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. దీంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ క్లారిటీ ఇచ్చేశారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







