నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు : కేంద్రమంత్రి పీయూష్ గోయల్
- February 04, 2020
న్యూఢిల్లీ: స్పైస్ బోర్డు విస్తరణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బోర్డు పసుపు పంట ఎగుమతులపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తుందని చెప్పారు. పసుపు సహా మిగతా మసాలా దినుసుల కోసం కార్యాలయం పనిచేస్తుందన్నారు. పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా లభిస్తాయన్నారు. పసుపు పంట నాణ్యత, దిగుబడి పెంచే విషయంలో బోర్డు ప్రాంతీయ కార్యాలయం పని చేస్తుందన్నారు. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎగుమతులకు బోర్డు అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. రైతులకు అంతర్జాతీయ బయ్యర్లతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలు లభించేలా తోడ్పడుతుందన్నారు. నిజామాబాద్ రైతులు కోరిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పించామని చెప్పారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







