మస్కట్:కూరగాయల ధరల పెంపుపై PACP సీరియస్..
- February 05, 2020
మస్కట్:కరోనా వైరస్ గల్ఫ్ దేశాలకు చేరకున్నా...దాని ఎఫెక్ట్ మాత్రం వివిధ రంగాల్లో కనిపిస్తోంది. చైనా నుంచి ఫేస్ మాస్క్ ఇంపోర్ట్ తగ్గిపోవటంతో గల్ఫ్ కంట్రీస్ లో ఇప్పటికే మాస్కులకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇక ఇప్పుడు నిత్యావసర సరుకులపైనా ప్రభావం చూపుతోంది. ఒమన్ లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చైనా నుంచి దిగుమతులు తగ్గిపోవటంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే..కూరగాయల ధరలను అదుపులో ఉంచేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్సూమర్ ప్రొటెక్షన్-PACP సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. దిగుమతులు తగ్గాయనే సాకుతో రేట్లను పెంచొద్దని ఇప్పటికే రిటైల్ ఔట్ లెట్స్, సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్స్ కు PACP సూచించింది. పెరిగిన రేట్లపై కస్టమర్స్ నుంచి కంప్లైంట్స్ రావటంతో ధరలను అదుపు చేసేందుకు ప్రస్తుతం చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. చైనా నుంచి అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, క్యారెట్ వంటి కూరగాయల దిగుమతి నెల రోజులుగా తగ్గింది. కేవలం డిమాండ్ ను బేస్ చేసుకొని రేట్లను పెంచాలనుకోవటం నేరమే అవుతుందనేది PACP వాదన. కూరగాయల కొరత ఉన్నా రేట్లు పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేదని ట్రేడర్స్ కు గుర్తుచేసింది. ప్రస్తుతం చైనా నుంచి కూరగాయల దిగుమతిపై ఎలాంటి నిషేధం లేదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..