ఆ ఆరుగురు, క్యాన్సర్‌ని జయించారు
- February 05, 2020
దుబాయ్:క్యాన్సర్‌ని జయించిన ఆ ఆరుగురు, క్యాన్సర్ అంటే 'మరణ శిక్ష' కానే కాదని నిరూపించారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా వీరంతా తమ అనుభవాల్ని పంచుకున్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద జరిగిన ఈవెంట్‌లో పాల్గొన్న ఆ ఆరుగురిలో ఒకరికి వైద్యులు తొలుత ఏడాది మాత్రమే జీవిస్తుందని చెప్పారు. అయితే, దిషా మోతియానీ మాత్రం తాను క్యాన్సర్‌ని జయిస్తాననే ధీమా వ్యక్తం చేశారు. ఆ ధైర్యమే ఆమెను గెలిపించింది. ఆమె హిప్ హాప్ డాన్సర్‌గా పనిచేశారు. 2012లో ఆమెకు క్యాన్సర్ వుందని తేలింది. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసే క్రమంలో, ఏడాది మాత్రమే ఆమె జీవిస్తుందని చెప్పారు. అయితే, ఆమె ఇప్పుడు ఎలాంటి సమస్యా లేకుండా జీవిస్తున్నారు. కాగా, 59 ఏళ్ళ ప్రియాంకా గుప్తా, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమె క్యాన్సర్ నుంచి కోలుకుని ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నారు. క్యాన్సర్ అంటే జీవితం ముగిసినట్లు కాదిప్పుడు. అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులో వున్నాయి. క్యాన్సర్‌ని జయించడానికి మానసిక స్థయిర్యం కూడా ముఖ్యమే.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..