ఒమన్:ఎడారిలో 3 రోజులు ఎమిరాతి బతుకుపోరాటం..
- February 05, 2020
ఒమన్:కనుచూపు మేర ఇసుక మేటలు. పలుకరించే నాధుడు లేడు. వెహికిల్ మధ్యలో పాడైపోయింది. ఎటు వెళ్లాలో తెలియదు. అలా మూడు రోజులు ఎడారిలోనే సాయం కోసం ఎదురుచూస్తు బిక్కుబిక్కుమంటూ గడిపాడో ఎమిరాతి వ్యక్తి. అల్ షార్కియా ఎడారిలో కార్ రైడ్ వెళ్లిన వ్యక్తి..వెహికిల్ బ్రేక్ డౌన్ అవటంతో ఎడారి మధ్యలో చిక్కుకుపోయాడు. అల్ షార్కియా గవర్నేట్ లోని అల్ నక్డా ఎడారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే..అతన్ని రక్షించేందుకు రాయల్ ఒమన్ పోలీసులు సెర్చ్ అపరేషన్ చేపట్టింది. ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత రెస్క్యూ టీంకు అతని ఆచూకీ చిక్కింది. ఎమిరాతి వ్యక్తిని రక్షించి ఎడారి నుంచి సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







