కరోనా అలర్ట్‌: ప్రయాణీకుల నుంచి డిక్లరేషన్స్‌ తీసుకుంటున్న సౌదీ అరేబియా

- February 05, 2020 , by Maagulf
కరోనా అలర్ట్‌: ప్రయాణీకుల నుంచి డిక్లరేషన్స్‌ తీసుకుంటున్న సౌదీ అరేబియా

రియాద్‌: సౌదీ అరేబియా తమ దేశానికి వచ్చే ప్రయాణీకులు, 15 రోజుల ముందు వరకూ తాము చైనా వెళ్లలేదని డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందిగా కోరుతోంది. జనరల్‌ డైరెకట్రేట్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. చైనాలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌, ఇతర దేశాలకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌తో కలిసి ఇప్పటికే ప్రికాషనరీ మెజర్స్‌ని తీసుకోవడం జరిగింది. అని ప్రవేశ మార్గాల్లోనూ స్క్రీనింగ్‌ స్టేషన్స్‌ని ఇప్పటికే ఏర్పాటు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com