మస్కట్ : ఒమన్ లో సూపర్ 30 టాలెంట్ హంట్...ఐదుగురు స్టూడెంట్స్ కి జాక్ పాట్ కొట్టే ఛాన్స్
- February 05, 2020
ఇంజనీర్ యాంబిషన్ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ ఈ నెలాఖరులో అద్భుతమైన అవకాశం ఎదురుకాబోతోంది. ఒమన్ లోని ఇండియన్ స్టూడెంట్స్ లో మెరిట్ విద్యార్ధులను ఎంపిక చేసేందుకు ఇండియన్ ఫేమస్ ఎడ్యూకేషన్ ప్రొగ్రామ్ సూపర్ 30 చేపట్టనున్నారు. ఇండియన్ ఎడ్యూకేటర్, మేథమేటీషియన్ ఆనంద్ కుమార్ తన సూపర్ 30 ప్రొగ్రామ్ ద్వారా వరల్డ్ వైడ్ ఫేమ్ అయిన సంగతి తెలిసింది. ఇండియాలోని ఇన్సిట్యూషన్స్ అఫ్ టెక్నాలజీతో పాటు ఇతర ప్రిమియర్ ఇంజనీరింగ్ ఇన్సిట్యూషన్స్ లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే ఎగ్జామ్స్ కు ఆనంద్ కుమార్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ సూపర్ 30 ప్రొగ్రాం ద్వారా గ్లోబల్ ఐఐటీ ఇన్సిట్యూషన్స్ లో ఎంట్రెన్స్ కోసం ఒమన్ లోనూ ఆనంద్ కుమార్ కోచింగ్ ఇవ్వనున్నారు. వాది కబిర్ కోచింగ్ ఇన్సిట్యూట్ లో ఒమన్ లోని ఇండియన్ స్టూడెంట్స్ కోచింగ్ ఇస్తారు. ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రెన్స్ కు సిద్ధమయ్యే 11,12వ తరగతి విద్యార్ధులకు కోచింగ్ ఉంటుంది. అలాగే గ్లోబల్ ఐఐటీయన్స్ లో 7 నుంచి 10వ గ్రేడ్ స్టూడెంట్స్ కు ఫౌండేషన్ క్లాసెస్ నిర్వహించనున్నారు. సూపర్ 30 టాలెంట్ హంట్ ప్రొగ్రామ్ ద్వారా ఐదుగురు మెరిట్ స్టూడెంట్స్ ను సెలక్ట్ చేస్తారు. ఈ నెల 7 నుంచి 19వరకు నిర్వహించే సూపర్ 30 టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నట్లు గ్లోబల్ ఐఐటీయన్స్ డైరెక్టర్ అదిల్ వెల్లడించారు. 6 నుంచి 12వ క్లాస్ చదివే స్టూడెంట్స్ సూపర్ 30లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే http://tiny.cc/Super-30_TalentHunt వెబ్ సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







