కువైట్:ఇంకా అపరిష్కృతంగానే పబ్లిక్ టాయిలెట్స్ సమస్య

- February 06, 2020 , by Maagulf
కువైట్:ఇంకా అపరిష్కృతంగానే పబ్లిక్ టాయిలెట్స్ సమస్య

కువైట్ సిటీలో పబ్లిక్ టాయిలెట్స్ సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉంది. కేపిటల్ గవర్నరేట్ పరిధిలో పబ్లిక్ బాత్రూమ్స్ ను ఎలా నిర్వహించాలనే అంశంపై గత సమ్మర్ నుంచి మున్సిపాలిటీ కమిటీ పలుమార్లు సమావేశమైంది. పబ్లిక్ బాత్రూమ్ నిర్వహణను పబ్లిక్ యుటిలిటీస్ మేనేజ్‌మెంట్ కంపెనీకి అప్పగించేందుకు మున్సిపాలిటీ కమిటీ తిరస్కరించింది. అయినా ఇంకా సమస్యకు పరిష్కారం లభించలేదు. పబ్లిక్ బాత్రూమ్స్ నిర్వహణకు పబ్లిక్ యుటిలిటీస్ మేనేజ్‌మెంట్ కంపెనీకి ఆర్ధిక స్థోమత సరిపోదనే కారణంతో ఆ కంపెనీని తిరస్కరించినట్లు మున్సిపాలిటీ అధికారులు వివరించారు. అయితే..పబ్లిక్ యుటిలిటీస్ మేనేజ్‌మెంట్ కంపెనీ వర్గాలు మాత్రం తాము రాజధాని పరిధిలో పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ కు సంబంధించిన ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఎప్పుడు ప్రతిపాదనలను నిరాకరించలేదని తెలిపాయి. ఇదిలాఉంటే కేపిటల్ లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ ఖర్చు అధ్యయనానికి మాత్రమే యుటీలిటి కంపెనికి బాధ్యతలు అప్పటించినట్లు మున్సిపల్ కౌన్సిల్ కమిటీ వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com