రాహుల్ తో రాజశేఖర్ కూతురి పెళ్లి!!
- February 06, 2020
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కుమార్తెకు దర్శకుడు కృష్ణవంశీ పెళ్లి చేస్తున్నారు. అయితే... అది నిజం పెళ్లి కాదు. సినిమా పెళ్లి! క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రంగ మార్తాండ'. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, కృష్ణవంశీ సతీమణి రమ్యకృష్ణ, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ఓ పాత్ర చేస్తున్నారు. 'బిగ్ బాస్' సీజన్ 3 ఫేమ్, హైదరాబాద్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఓ పాత్ర చేస్తున్నాడు. సినిమాలో వీళ్ళిద్దరి పెళ్లి సన్నివేశం ఉందని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 'రంగ మార్తాండ' చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే రాహుల్, శివాత్మిక మధ్య పెళ్లి సన్నివేశం తెరకెక్కించారు. సినిమాలో పెళ్లికి ఉన్న ప్రాధాన్యత ఏంటో విడుదలైతే కానీ తెలియదు. 'దొరసాని' తర్వాత శివాత్మిక నటిస్తున్న చిత్రం ఇదే. కథానాయికగా తొలి చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. కానీ భారీ విజయం మాత్రం దక్కలేదు. కృష్ణవంశీ 'రంగ మార్తాండ'తో నటిగా మరింత గుర్తింపుతో పాటు భారీ విజయం దక్కుతుందని ఆశిస్తున్నారట.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







