దుబాయ్: వాట్సాప్ పై ప్రయోగం..యూఏఈలో వాట్సాప్ వీడియో, వాయిస్ కాల్స్ సక్సెస్

- February 06, 2020 , by Maagulf
దుబాయ్: వాట్సాప్ పై ప్రయోగం..యూఏఈలో వాట్సాప్ వీడియో, వాయిస్ కాల్స్ సక్సెస్

యూఏఈ రెసిడెన్స్ కి వాట్సాప్ వీడియో, వాయిస్ కాల్స్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయా? దీనిపై కొన్నాళ్లుగా యూఏఈలో కొన్ని రూమర్స్ కొనసాగుతున్నాయి. వీడియో, వాయిస్ కాల్స్ ఫీచర్స్ పని చేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే..ఈ ప్రచారంలో నిజానిజాలు తేల్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. యూఏఈలోనూ వాట్సాప్ కాలింగ్ ఫీచర్స్ పనిచేస్తున్నాయి. ముందుగా ఆఫీస్ లోని బిజినెస్ వైఫై ద్వారా వీడియో కాల్ చేయటంతో కాల్ కనెక్ట్ అయ్యింది. అయితే..క్లారిటీ కొద్దిగా తక్కువగా ఉన్నా వీడియో కాల్ మాట్లాడుకునే ఛాన్స్ మాత్రం ఉంది. అలాగే ఇంట్లో వాడే వైఫే ద్వారా చేసిన ప్రయత్నం కూడా సక్సెస్ అయ్యింది. అయితే..మొబైల్ నెట్వర్క్, రెండు వేర్వేరు వైఫై నెట్వర్క్ లతో మాత్రం కాల్ కనెక్ట్ అవటం లేదు. అలాగే ఇంటర్నేషనల్ కాల్స్ కూడా కనెక్ట్ అవటం లేదు.

నిజానికి యూఏఈలో వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా వీడియో, వాయిస్ కాలింగ్ ఫీచర్స్ అందుబాటులో లేవు. కేవలం స్కైప్ యాప్ ద్వారా మాత్రమే చేసుకోవచ్చు. అదీ కూడా
బిజినెస్ అకౌంట్స్ ఉన్న వారు మాత్రమే స్కైప్ కాల్స్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక బాటిమ్, వైకో వంటి టెలికం ప్రొవైడర్లు తమ యాప్స్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ సర్వీస్ అందిస్తున్నాయి. నెలకు Dh50 నుంచి  Dh100 వరకు ఛార్జ్ చేస్తున్నాయి. ఇదిలాఉంటే టుటాక్ లో ఫ్రీ వాయిస్ కాల్స్ కు చేసుకునే వెసులుబాటు ఉన్నా..కొన్నాళ్లుగా ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ కనిపించటం లేదు. గతంలో టూటాక్ డౌన్ లోడ్ చేసుకున్న వారు మాత్రం ఇప్పటికీ కాల్స్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు వాట్సాప్ కాల్స్ కనెక్ట్ అవుతుండటం కొంత ఊరట ఇచ్చే అంశమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com