కరోనా వైరస్ బాధితులకు యూఏఈలో ఉచిత వైద్యం
- February 06, 2020
దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ), హాస్పిటల్స్‌కి సర్క్యులర్ జారీ చేసింది కరోనా వైరస్ విషయమై. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ సూచనల మేరకు డిహెచ్ఎ లైసెన్స్డ్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నీ, కరోనా వైరస్ అనుమానిత కేసుల్ని అత్యవసర కేసులుగా డీల్ చేయాల్సి వుంటుంది. అనుమానితులు లేదా బాధితులకు ఇనూన్స్యూరెన్స్ సౌకర్యం వున్నా లేకపోయినా, వారికి ఉచితంగానే వైద్య చికిత్స అందించాలన్నది ఈ డైరెక్టేటివ్స్ సారాంశం. ఇన్స్యూరెన్స్ వున్న పేషెంట్‌ని ఎమర్జన్సీ విభాగంలో వైద్య చికిత్స అందించాలనీ, సంబంధిత ఇన్స్యూరెన్స్ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా క్లెయిమింగ్ ప్రక్రియ వుండాలని పేర్కొన్నారు. ఒకవేళ ఇన్స్యూరెన్స్ లేకపోయినా, బాధితులు ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఐదుగురు కరోనా పాజిటివ్ పేషెంట్లకు యూఏఈలో వైద్య చికిత్స అందుతోంది. వీరిలో నలుగురు యూఏఈలో వుంటోన్న చైనీస్ కుటుంబ సభ్యులు కాగా, మరొకరు చైనా టూరిస్ట్. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే వుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..