ఖతార్‌లో పొగమంచు కారణంగా 113 ప్రమాదాలు
- January 19, 2016
ఖతార్‌లో సుమారు 113 యాక్సిడెంట్స్ ఈ రోజు (19 జనవరి) నమోదయ్యాయి. విపరీతంగా పొగమంచు ఆవరించడంతో వాహనదారులు విజిబిలిటీ లేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే అనేక యాక్సిడెంట్స్ జరిగాయి. అయితే ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదు. అలాగే తీవ్ర గాయాలైన సందర్భాలు కూడా తక్కువే. ప్రమాదాల్ని నివారించేందుకు అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. భద్రతా ప్రమాణాల్ని పాటించాలనీ, అలాగే వాతావరణ శాఖ హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు. విజిబిలిటీ తక్కువగా ఉంటుంది గనుక, వేగ నియంత్రణ పాటించడం, అలాగే ఓ వాహనం ఇంకో వాహనంతో తగిన దూరాన్ని పాటించడం వంటివి చేయాలని అధికారులు చెప్పారు. ఫాగ్ లైట్స్, లో బీమ్ లైట్స్‌ని ఉపయోగించడం శ్రేయస్కరమని అధికారులు అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







