కువైట్:కీలక ప్రాజెక్టుల్లో షెపర్డ్స్, ఫార్మర్స్, బార్బర్స్...తనిఖీల్లో విస్మయ నిజాలు

- February 07, 2020 , by Maagulf
కువైట్:కీలక ప్రాజెక్టుల్లో షెపర్డ్స్, ఫార్మర్స్, బార్బర్స్...తనిఖీల్లో విస్మయ నిజాలు

కువైట్:ఎయిర్ పోర్ట్ వంటి కీలక ప్రాజెక్టుల్లో పని చేసే లేబర్స్ కు కూడా తాము చేస్తున్న పని పట్ల కాస్తో కూస్తో అవగాహన ఉండాలి. అదీ రన్ వే, కంట్రోల్ టవర్ ప్రాజెక్టుల్లో అయితే కనీస అవగాహన అవసరమే. అలాంటి కీలక ప్రాజెక్టుల్లో గొర్రెల కాపరులు, వ్యవసాయదారులు, బార్బర్స్ తో పని చేయిస్తే ఎలా ఉంటుంది? కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులో ఇదే జరిగింది. త్రిసభ్య కమిషన్ చేపట్టిన తనిఖీల్లో ఇలాంటి విస్మయ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నుంచి కూడా సభ్యులు ఉన్న ఈ కమిషన్ కువైట్ ఎయిర్ పోర్టులో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే రహదారులను మూసివేసి..దాదాపు ఐదు గంటల పాటు అక్కడ పని చేసే లేబర్స్ ఐడెంటీ, అర్హతలను చెక్ చేశారు. ఈ తనిఖీల్లో ప్రాజెక్టు పనులకు అనర్హులు, అసమర్ధులను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. రెసిడెన్స్ అండ్ లేబర్ లా నిబంధనలకు అది పూర్తి వ్యతిరేకం కావటంతో వారిని అరెస్ట్ చేశారు. లేబర్ లా వయోలేటర్స్ కోఅపరేటీవ్ సోసైటీస్ స్పాన్సర్ చేసిన లేబర్స్ గా గుర్తించారు. అందులో షెపర్డ్స్, బార్బర్స్, ఫార్మర్స్ ఉన్నట్లు గుర్తించారు. వాళ్లందరు డొమస్టిక్ సర్వేంట్స్. ఆర్టికల్ 18 వీసా ప్రకారం డొమస్టిక్ సర్వెంట్స్ ను స్పాన్సర్ చేయటానికి లేబర్ లా నిబంధనలకు విరుద్ధం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com