షార్జా:కల్బా సిటీలో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ను పరిశీలించిన షార్జా రూలర్
- February 07, 2020
షార్జా:డెవలప్మెంటల్ ప్రాజెక్టుల ద్వారా ఎమిరాతి ఆఫ్ షార్జా పౌరులకు అత్యుత్తమ సర్వీస్ అందించటమే తమ లక్ష్యమని షార్జా రూలర్ ముహమ్మద్ అల్ ఖసిమి పేర్కొన్నారు. కల్బా
సిటీలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆయన పరిశీలించారు. కల్బా నగరంలో పలు డెవలప్మెంటల్, టూరిస్టిక్ ప్రాజెక్టుల కోసం ఎమిరాతి ఆఫ్ షార్జా 5 బిలియన్ల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ లను కేటాయించినట్లు షేక్ సుల్తాన్ వెల్లడించారు. షార్జా-కల్బా రహదారి కోసం మరో బిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ లను కేటాయిస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇదే ఏడాదిలోనే ప్రారంభం కాబోతున్న ఈ రహదారితో షార్జా-కల్బా మధ్య ప్రయాణ సమయం 90 నిమిషాల నుంచి 45 నిమిషాలకు తగ్గనుంది. అలాగే కల్బా అభివృద్ధికి షార్జా సుల్తాన్ పలు ప్రాజెక్టులను అనౌన్స్ చేశారు. వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సైన్స్ అకాడమీ,రావాక్ కల్బా కర్నిచ్, షాపింగ్ మాల్ వంటివి రూలర్ ప్రకటించిన ప్రాజెక్టుల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







